అక్షరటుడే బాన్సువాడ : నాందేడ్ జిల్లా ముధ్కేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హన్మంత్ రావు మంగళవారం నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబరు 20న మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.