అక్షరటుడే, బోధన్ : Bodhan | పట్టణంలోని శక్కర్‌నగర్(Shakkarnagar)లో హనుమాన్ వ్యాయామశాల(Hanuman Gymnasium) భవనాన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనాన్ని నిర్మించారు. ఇందుకోసం బీజేపీ నాయకుడు అడ్డూరి శ్రీనివాస్(BJP leader Adduri Srinivas) ఆధ్వర్యంలో యువకులు చందాలు వేసుకుని భవన నిర్మాణం చేపట్టారు. గురువారం ఉదయ్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అన్నదానం(Annadanam) చేయనున్నట్లు వ్యాయామశాల(Gymnasium) నిర్వాహకులు తెలిపారు.
Bodhan | బోధన్‌లో హనుమాన్ వ్యాయామశాల భవనం ప్రారంభం
Advertisement
Advertisement