అక్షరటుడే, బోధన్: పట్టణంలోని పాత బోధన్‌లో గల ఎల్లమ్మగుడి చావడి హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం గ్రామ కమిటీ అధ్యక్షుడు బాగయ్య యాదవ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.