అక్షరటుడే, ఎల్లారెడ్డి: Hanuman victory : ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు. ముందుగా హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
Advertisement
అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వీర హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలతో సాతెల్లి బేస్ హనుమాన్ మందిరం నుంచి డైలీ మార్కెట్ గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా శోభాయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా దారి పొడవునా భక్తుల జై శ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణ మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement