అక్షరటుడే, జుక్కల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు(BC RESERVATION BILL)ను అసెంబ్లీ(ASSEMBLY) ఏకగ్రీవంగా ఆమోదించడం హర్షణీయమని మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జుక్కల్(JUKKAL) నియోజకవర్గం కాంగ్రెస్(CONGRESS) పార్టీ సీనియర్ నాయకుడు జయ ప్రదీప్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి కృషి అద్భుతమన్నారు. అలాగే కుల గణన సర్వే దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో చేపట్టడం గొప్ప విషయమని వివరించారు.
BC RESERVATION | బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం
Advertisement
Advertisement