
అక్షర టుడే, వెబ్ డెస్క్ Allu Arjun : మెగాస్టార్ చిరంజీవిని(Chiranjeevi) స్పూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాడు అల్లు అర్జున్(Allu Arjun). డాడి సినిమాలో బన్నీని తొలిసారి చూసి అంతా మురిసిపోయారు. ఇక గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అప్పుడు బన్నీ లుక్‌ని చూసి చాలా మంది విమర్శించారు. మ్యూజికల్‌గా, స్టోరీ పరంగా గంగోత్రి సినిమా సక్సెస్ అయింది. కానీ ఇతను హీరో ఏంటి? అని అంతా అనుకున్నారు. అసలు హీరో మేటీరియల్ కాదు అంటూ విమర్శంచారు. కానీ ఆ విమర్శలని తన బలంగా మార్చుకొని ఎదిగారు. ఇరవైఏళ్ల తరువాత ప్రపంచానికి పుష్ప రూల్ ఎలా ఉంటుందో చూపించాడు బన్నీ.
ఇప్పుడు రెండు వేల కోట్ల హీరోగా అల్లు అర్జు న్(Allu Arjun) తన బ్రాండ్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రుచిచూపించాడు. అల్లు అర్జున్..(Allu Arjun) 1982లో ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో పుత్రుడిగా జన్మించారు. బాల నటుడిగా చిరంజీవి హీరోగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నటించిన ‘విజేత’లో బాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అంతేకాదు కమల్ హాసన్ స్వాతిముత్యంలో కూడా బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’లో చిన్న క్యారెక్టర్ లో మెరిసాడు. గంగోత్రితో హీరోగా మొదలైన బన్నీ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతుంది.
కెరీర్‌లో ఎన్నో హిట్స్, పుష్ప (pushpa) చిత్రాలతో పలు రికార్డులు.. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తెలుగు నుంచి మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇదే కాక సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్.. అల్లు అర్జున్ పై ఓ డాక్యుమెంటరీ చేసింది.మన దేశంలో ఈ ఘనత అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో పెట్టారు. బన్నీ అంటే ఇప్పుడు పేరు కాదు బ్రాండ్. ఆయన త్వరలో త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో పౌరాణిక మూవీలో నటించబోతున్నాడు. అలానే అట్లీ దర్శకత్వంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. పుష్ప 3 మూవీతో పలకరించనున్నాడు. 43 ఏళ్ల వయస్సులోను బన్నీ దూకుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.