అక్షరటుడే, ఇందూరు: Municipal Commissioner | ట్రేడ్ లైసెన్స్ trade license పేరుతో అధికారుల వేధింపులు సరికాదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను Municipal Commissioner Dilip Kumar కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఫీజులు వసూలు చేస్తున్నారని, తమ ఐడెంటిటీ తెలపకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి కమల్ ఇనాని, నిశిత రాజు, మోహన్ రెడ్డి, భక్త వత్సలం, శ్యాంఅగర్వాల్, దినేష్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Municipal Commissioner | లైసెన్స్ పేరుతో వేధింపులు సరికాదు
Advertisement
Advertisement