Hardik Pandya : హార్ధిక్ చేసిన ప‌నికి తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..!

Hardik Pandya : హార్ధిక్ చేసిన ప‌నికి తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..?
Hardik Pandya : హార్ధిక్ చేసిన ప‌నికి తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Hardik Pandya : ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) గ‌త సీజ‌న్ నుండి విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. గుజ‌రాత్‌ని వ‌దిలి ముంబైలోకి వ‌చ్చి ఏకంగా కెప్టెన్ కావ‌డంతో రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ అత‌నిని దారుణంగా ట్రోల్ చేశారు. గ‌త సీజ‌న్‌లో ఏ ప్లేస్‌కి వెళ్లిన అక్క‌డ రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ సీజ‌న్‌లోనూ (Hardik Pandya) హార్ధిక్ పాండ్యా తీరు ఏమి బాగోలేద‌ని అంటున్నారు. సహచర ఆటగాళ్ల రికార్డులను అడ్డుకోవడం (Hardik Pandya) హార్దిక్ పాండ్యాకు ఏం స‌ర‌దా అంటూ తిట్టిపోస్తున్నారు. ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన (Mumbai Indians) ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Advertisement
Advertisement

Hardik Pandya : తీరు మార‌దా?

అయితే ఈ మ్యాచ్‌‌తో ఐపీఎల్‌ (IPL) లోకి అరంగేట్రం చేసిన అశ్వని కుమార్ (Ashwani Kumar) అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై జ‌ట్టుని గెలిపించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను 3 ఓవర్లు వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌కి బెంబెలెత్తిపోయిన అజింక్యా రహానేతో పాటు రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ పెవిలియన్ చేరారు. మంచి రిథమ్‌లో బౌలింగ్ చేసిన అశ్వని కుమార్‌కు హార్దిక్ పాండ్యా మరో ఓవర్ ఇవ్వకుండా ఆపేయ‌డం ఫ్యాన్స్‌కి చాలా కోపం తెప్పిస్తుంది. అతను 13వ ఓవర్‌లో చివరిసారిగా బౌలింగ్ చేయగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 16.2 ఓవర్లలో ముగిసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Ashwani Kumar : అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టిన ముంబై బౌల‌ర్.. అస‌లు ఎవ‌రు ఈ అశ్వని కుమార్ ?

అయితే మ‌ధ్య‌లో ఒక ఓవ‌ర్ ఇచ్చిన కూడా అశ్వని కుమార్ (Ashwani kumar) ఐదు వికెట్లు తీసేవాడు. అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన ఘనత అతని సొంతమయ్యేది. కానీ (Hardik Pandya) హార్దిక్ పాండ్యా అశ్వని కుమార్‌కు (Ashwani Kumar) కాకుండా.. మిచెల్ సాంట్నర్, విజ్ఞేష్ పుతుర్‌తో బౌలింగ్ చేయించ‌డం వివాదాస్ప‌దం అయింది. కామెంటేట‌ర్స్ కూడా అశ్విని కుమార్‌కి మ‌రో ఓవ‌ర్ బౌలిగ్ ఇవ్వ‌క‌పోవడాన్ని త‌ప్పుబ‌ట్టారు. గతంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని కూడా హార్దిక్ పాండ్యా ఇలానే అడ్డుకున్నాడని గుర్తు చేస్తూ తిట్టిపోస్తున్నారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ విరాట్ కోహ్లీ సెంచరీకి ఇలానే హార్దిక్ అడ్డుతగిలాడని, భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడంటూ హార్ధిక్‌కి గ‌ట్టిగానే ఇస్తున్నారు.

Advertisement