Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. హరీశ్‌ కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు.1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement