అక్షరటుడే ఇందూరు: MANALA | మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ బీజేపీ కోవర్టులని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సామెతను తప్పుగా అర్థం చేసుకొని హరీష్ రావు, కవిత కావాలని రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
MANALA | అసెంబ్లీలో చర్చించాలి..
కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో అభివృద్ధిపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని హరీష్ రావు(Harish Rao)కు సవాల్ విసిరారు. కేవలం పార్టీలో తన ఆధిపత్యం కోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై కూడా అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఉన్నంతవరకు హరీష్ రావుకు పార్టీ పగ్గాలు దక్కవనే అక్కసుతో ఉన్నాడని విమర్శించారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.