అక్షరటుడే, వెబ్‌డెస్క్: harsha sai | బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న, చేసిన వారికి చుక్కలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి గట్టిగానే ట్రీట్‌మెంట్ ఇస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దంటూ ఆర్టీసీ ఎండీ సూచించారు. గత కొన్ని నెలల నుంచి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై ఉక్కు పాదం మోపుతున్నారు.
harsha sai | తప్పు తెలుసుకున్నాడా..
చెప్పిన వినకపోతే వారిని జైలులో పడేస్తున్నారు. ఇప్పటికే లోకాల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్‌లపై కేసులు నమోదు కాగా, హర్ష సాయిని అరెస్ట్ చేసి జైలుకి పంపనున్నట్టు తెలుస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి మాట్లాడిన మాటల్ని సజ్జనార్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో హర్ష సాయి దిగొచ్చినట్టు తెలుస్తుది. తన సోషల్ మీడియా వేదికగా ఎవరు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయవద్దని,. బెట్టింగ్ మూలాలపై పోరాడుదామంటూ పోస్ట్ పెట్టాడు.మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ఈ సందర్భంగా హర్షసాయి తన సోషల్ మీడియాలో తెలిపాడు. కాగా కొన్ని నెలల క్రితం ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు హర్ష సాయి. ఈ కేసులో అతనికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ కాగా, బెయిల్‌పై బయటకి వచ్చాడు. ఆ వివాదం చల్లారిందో లేదో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఈ ఇరుక్కున్నాడీ యూట్యూబర్.