రూ.10 కోసం వేలు కోసేశాడు..

Advertisement

అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గప్​చుప్​ తిన్నాక, డబ్బులు అడిగితే.. సదరు చిరు వ్యాపారిపై దాడి చేశాడు. నగరంలోని రెండో ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.

శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్​ గప్​చుప్​ బండి నడిపిస్తున్నారు. కాప్సే హర్మిత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్​ వద్ద ₹10 గప్​చుప్​లు తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగితే.. నన్నే అడుగుతావా.. అంటూ తన వద్ద ఉన్న చిన్న చాకుతో ఆకాశ్​ వేళ్ళు కోశాడు.

ఘటనా స్థలానికి రెండో ఠాణా పోలీసులు చేరుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్​ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనతో అక్కడే ఉన్న స్థానికులు కంగుతిన్నారు. పది రూపాయల కోసం దారుణానికి పాల్పడడం ఏమిటని చర్చించుకుంటున్నారు.

Advertisement