నిజాంసాగర్, అక్షరటుడే: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి అభయాంజనేయ స్వామి(ఏకశిల) సప్తమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 8న నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త పట్లోల్ల సునీత కిషోర్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. 108 నది జలాలతో అభిషేకం, మూలమంత్రం పావనము, తమలపాకులతో నాగవల్లి దళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆంజనేయ స్వామి వారికి అర్చన, శివునికి లక్ష పత్రి, పుష్ప దళాలతో అర్చన, పూర్ణాహుతి, మంగళ హారతి, తీర్థప్రసాదాలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.