
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Health Benefits : ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంట కూడా సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారు. సంతాన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా, వారికి సంతానం మాత్రం కలగడం లేదని జంటలు వాపోతున్నారు. సంతానం కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్ లు తీసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినాకానీ ఫలితం లేకుండా పోతుంది. అయితే ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మూలికలు సంతాన సమస్యలకు, లైంగిక సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద మూలికలలో శతవారీ టాప్ ప్లేస్ లో ఉంటుంది.
ఏన్నో సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో శతావరి ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. దిని శాస్త్రీయ నామం ఆస్పరాగస్ రేసిమోసిస్ (asparagus recemosus). మూలికలు మహిళల ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం పడనక్కర్లేదు. కేవలం మహిళలకు మాత్రమే కాదండోయ్,పురుషులు, పిల్లలు దీని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శతవారి మూలికలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్ ఈ, విటమిన్ కె,పోలీక్, ఐరన్, క్యాల్షియం జింక్ పొటాషియం అంటే ముఖ్యమైన పోషకాలు శతావరిలో లభిస్తాయి. నిరోధక శక్తిని పెంచుతూ జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. శారీరక,మానసిక, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఈ శతావరి ఎంతో సాయపడుతుంది.
శతావరి ప్రయోజనాలు ఇవే : వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో శతవారీ కీలకపాత్రను పోషించగలదు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ శరీరంలో ప్రియురాడికల్స్ తో పోరాడి కణాలను నష్టం నుండి కాపాడగలదు.శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని కూడా అందించి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించగలదు. తరచూ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు బాధపడేవారు శతావరిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పురుషులకు మేలు : శతావరి ఈ కేవలం మహిళలకే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. ఈ శతావరి పురుషులలో సంతాన ఉత్పత్తికి కావలసిన శక్తిని అందిస్తుంది. అధ్యయనం ప్రకారం శతావరిలో సారం నీలియ కణాల సంఖ్యను పెంచడం ద్వారా పురుషులలో వంధ్యత్వ సమస్యలు తగ్గిస్తుంది. దీనివల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగు పడుతుంది. టెస్ట్ స్టెరాన్స్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. మగవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
మహిళలకు దివ్య ఔషధం : శతావరి మహిళల ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీనిని స్త్రీ టానిక్ గా కూడా వర్ణిస్తారు. శతవారి మహిళలలో సంతానోత్పత్తికి లైంగిక ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వారు ఈ మొక్కను తింటే, త్వరగా గర్భం దాల్చడం సులభతరమవుతుంది. పాలిచ్చే తల్లులు దీన్ని సేవించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. రుతుక్రమం సక్రమంగా లేని సమస్యలు కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వేడి, ఆవిర్లు మానసిక కల్లోలం నిద్రలేమి వంటి వాటిని కూడా శతవారి తగ్గిస్తుంది. ఈ శతవారి మొక్క హార్మోన్లు ఉత్పత్తిని పెంచడానికి, లైంగిక కోరికలను పెంచడానికి సాయపడుతుంది.
చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : శతవారి మొక్క చర్మానికి, జుట్టుకు ఎంతో పోషణనిస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. శతవారిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుటకు సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెనన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. శతవారి మొక్క జుట్టు రాలే సమస్యను తగ్గిస్తూ, జుట్టుని దృఢంగా ఉంచుతుంది. ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : శత వారి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపులో మంట,అసిడిటీ, గ్యాస్ నుండి సమస్యను తగ్గిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించటానికి.ఇంకా ప్రేగు కడలికలను సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే సమస్యలను శతావరి తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండే జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
ఆరీరక మానసిక బలాన్ని పెంచుతుంది : మానసిక అలసటలను నివారించి. నరాలను శాంత పరుస్తుంది. మంచి నిద్రను ఇస్తూ, క్రమం తప్పకుండా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది : శతవరి మూత్రపిండాలో ఆరోగ్యని మెరుగుపరచటానికి,మూత్ర విసర్జనను పెంచుతుంది. శరీరంలో విష పదార్థాన్ని తొలగించుటకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా శతావరి వివరిస్తుంది. మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
శతావరిని ఎలా ఉపయోగించాలి : వారిని వివిధ రూపాలలో ఉపయోగించవచ్చు. శతావరి చూర్ణం,శతావరి క్యాప్యూల్స్, శతావరి సిరప్, శతావరిని టాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు అవసరానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. శతావరి చూర్ణాన్ని పాలలో లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. శతవారికి క్యాప్సూల్స్ టాబ్లెట్లను నేరుగా నీటితో తీసుకోవచ్చు. శతావరి సిరపును నేరుగా లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. దీనిని ఆయుర్వేద వైద్యులు సలహా మేరకు ఉపయోగించడం మంచిది. ఎలర్జీస్ ని కలిగించవచ్చు. విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.