అక్షర టుడే, వెబ్ డెస్క్ Health Benefits : ఈరోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం (Health) బాగోలేకపోతే ఏం చేయలేం. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆరోగ్యం కుదుటపడుతుందనే నమ్మకం ఉండదు. ఈరోజుల్లో వచ్చే వ్యాధులు కూడా అలాగే ఉన్నాయి. అందుకే, ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మన వంటింట్లోనే మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు చాలా ఉంటాయి. కానీ, వాటి గురించి మనకు సరైన అవగాహన ఉండదు.
మీకు దాల్చిన చెక్క తెలుసు కదా, అలాగే సోంపు తెలుసు కదా. ఈ రెండు అందరి ఇళ్లలోనూ ఉంటాయి కానీ, వీటి వల్ల ఎంత బెనిఫిట్ కలుగుతుంది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. దాల్చిన చెక్క, సోంపు ఈ రెండు కలిస్తే శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిని పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడుతారు. రాత్రి పూట దాల్చిన చెక్క, సోంపు ఈ రెండింటినీ నీళ్లలో నానబెడితే అది బెస్ట్ మెడిసిన్ అవుతుంది.
Health Benefits : బరువు తగ్గాలనుకున్నా, శరీరంలోని చెడు పదార్థాలు బయటికి వెళ్లాలన్నా ఇది చేయండి
మీరు బరువు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నా, కడుపులో సమస్యలు ఉన్నా, జీర్ణ వ్యవస్థ (Digestive system) సరిగ్గా పని చేయకపోయినా, శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటికి పోవాలన్నా, ఇమ్యూనిటీ పవర్ ను పెంచాలన్నా, షుగర్ లేవల్స్ కంట్రోల్ (Sugar Levels Control) చేయాలన్నా, దాల్చినచెక్క, సోంపు నీళ్లను ప్రతి రోజు ఉదయే ఖాళీ కడుపున తాగాల్సిందే.
దాని కోసం మీరు ఏం చేయాల్సింది లేదు. జస్ట్ ఒక టీస్పూన్ సోంపు, సగం టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ఒక గ్లాస్ వాటర్ ఉంటే చాలు. ముందుగా ఒక గ్లాస్ వాటర్ ను బాగా వేడి చేసి అందులో సోంపు, దాల్చిన చెక్క పౌడర్ వేసి కలపాలి. దాన్ని రాత్రంతా నానటెట్టి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే చాలు. ఇలా కొన్ని రోజుల పాటు తాగితే పైన చెప్పిన అనారోగ్య సమస్యలన్నీ (Health problems) పరార్ అవుతాయి.