అక్షరటుడే, వెబ్‌డెస్క్ Health Benefits : ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలలో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇది చూడటానికి పాములాగా పొడవుగా ఉంటుంది. అందుకే దీనిని Snake Gourd ని కూడా అంటారు. పొట్లకాయలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. కావున, మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. కాబట్టి, లకాయని తరచూ తినడం అలవాటు చేసుకోండి. పొట్లకాయ తినడం వల్ల సీజన్లు మారుతున్నప్పుడు కలిగే వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడగలదు. పొట్లకాయలలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడగలదు.
పొట్లకాయతో ఆరోగ్య ప్రయోజనాలు : పొట్లకాయ తినడం వలన క్యాన్సర్ని నిరోధించవచ్చు. ఈ పొట్లకాయలలో క్యాన్సర్ కణాలను ఎదుర్కోగలిగే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పొట్లకాయ ప్రతిరోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తదితర సమస్యలు చక్కటి పరిష్కారం గలదు ఈ పొట్లకాయ. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి పొట్లకాయ ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా, జ్వరం వచ్చిన, కామెర్లు సోకిన పొట్లకాయ తింటే త్వరగా కోలుకుంటారు. కాయని ధనియాలతో కలిపి తీసుకుంటే కామెర్ల త్వరగా నయం అవుతాయి అంట. పొట్లకాయ మాత్రమే కాదు పొట్లకాయ ఆకులు శరీరంపై రుద్దితే జ్వరం నుంచి ఉపశమనం లభించుతుంది. అంతే కాదు, పొట్లకాయ తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు ముఖ్య పాత్రను వహిస్తుంది. పొట్లకాయలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢత్వానికి పొట్లకాయ బాగా పనిచేస్తుంది. ఇంకా, ఈ పొట్లకాయ తినడం వల్ల, నీరసం, అలసట ఉండవు. దీనిలో ఉండే కుకుర్బిటాసిస్ అనే సమ్మేళనాలు శరీర రక్షణ వ్యవస్థకు బలంగా మార్చుతుంది. లివర్ పని తీరుకు కూడా పొట్లకాయ బాగా పనిచేస్తుంది. గుండె దడ, చాతి నొప్పి, హై బీపీ, వంటి గుండె సమస్యలతో బాధపడేవారు 30ml తదుల్లో పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పొట్లకాయని ఆహారంలో తరచూ చేర్చుకుంటూ ఉండండి. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
పొట్లకాయలో పోషకాలు : పొట్లకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి నీ కలిగి ఉంటాయి. పొట్లకాయ వలన డిహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. ఇది సమ్మర్ లో వేడి త్రీవ్రతకు గురికాకుండా కాపాడుతుంది. కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ కాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయగలదు. ఇది షుగరు పేషంట్లకి మంచి ఔషధం. పొట్లకాయ వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరచగల గుణాన్ని కలిగి ఉంది. పొట్లకాయ చర్మ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించగలదు. బరువు తగ్గాలనుకునే వారు ఈ పొట్లకాయని డైట్ లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఎండాకాలంలో సొరకాయలు, దోసకాయలు, ఎక్కువగా తీసుకుంటాం. వీటి లాగానే పొట్లకాయలను కూడా సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే వీటిలో ఉన్న నీటి శాతం శరీరాన్ని ఎండ నుంచి, డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఎండాకాలంలో వేడి సమస్యల నుంచి బయటపడుటకు, తాజా కూరగాయలు, పండ్లు, అలాగే నీరు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం, అధికంగా ఫైబర్ శాతం అన్న కూరగాయలను ఎక్కువగా తినాలి. వేసవిలో ఎండ తీవ్రత నుంచి కాపాడగలరు పొట్లకాయ. ఈ పొట్లకాయ వేసవిలో ఎక్కువగా లభిస్తుంది.