అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రతి మండలానికి రెండు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రోగులకు 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని అన్నారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరనే విమర్శ రావొద్దని అధికారులకు సూచించారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా చర్యలు చేపడుతామన్నారు. మంచిర్యాలలో రూ.360 కోట్లతో చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దామోదర మాట్లాడారు.