అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్(Congress)లో చేరిన పది మంది ఎమ్మెల్యే(MLA)లను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో అసెంబ్లీ సెక్రెటరీ తరఫున గురువారం అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi) వాదనలు వినిపించారు. బుధవారం స్పీకర్ తరఫున ముకుల్ రోహిత్గ్(Mukul Rohit) వాదించారు. ఈ కేసులో బీఆర్ఎస్ న్యాయవాది వాదనలు గతంలోనే ముగిశాయి. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫు వాదనలు కూడా సుప్రీం కోర్టు రికార్డు చేసింది. కాగా విచారణ సందర్భంగా రీజనబుల్ టైం కావాలని సింఘ్వి అనడంతో కోర్టు(Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. 2028 వరకు సరిపోతుందా అని ప్రశ్నించింది. కాగా ఈ కేసులో విచారణ ముగియడంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్(Reserve) చేసింది.