అక్షరటుడే, వెబ్‌డెస్క్ Heart Care Tips : రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే … ఏ ప్రమాదాలు జరుగుతాయో అని భయంగా ఉంటుంది.ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో… అని, ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం.ఈ మండుటి ఎండల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. ఈ ఎండ తీవ్రత నుంచి బయటపడుటకు శరీరాన్ని చల్లబరుచుటకు ఈ జ్యూస్ తాగారంటే ఇక మీకుఎండ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.
మరి ఆ జ్యూస్ ఏమిటంటే కీరదోస జ్యూస్. కీరదోసకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పోషకాలతో నిండిన గని అని చెప్పవచ్చు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కీర దోసలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ కీరదోస మంచి ఎంపిక. ఈ ఎండాకాలంలో కీరదోస జ్యూస్ తాగితే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Heart Care Tips : కీర దోసకాయ జ్యూస్ ప్రయోజనాలు
కీర దోసకాయ జ్యూస్ మంచి డిటాక్స్ డ్రింకులా కూడా పనిచేస్తుంది.ఉదయం పరగడుపున కీరదోస జ్యూస్ తాగితే శరీరం నుంచి అవాంఛిత వ్యర్ధాలను బయటకు పంపి శుభ్రపరచటానికి సహాయపడుతుంది. అంతేకాదు, అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించగలదు. ప్రతిరోజు కీరదోస జూసు తాగారంటే మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. దీనివలన బరువు కూడా తగ్గవచ్చు. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నాను. ఉబకాయ సమస్యతో బాధపడే వారికి కీరదోస జూసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ కీరదోసనే జ్యూస్ లాగా, ఇంకా కీరదోసలు నేరుగా కూడా తినవచ్చు. కీరదోసను నేరుగా తింటే ఇంకా మరిన్ని పోషకాలు అందుతాయి. వేసవి కాలంలో కీరదోస జ్యూస్ తాగితే శరీరంలో వేడి అనుభూతి తగ్గి, రాన్ని వెంటనే చల్లబరచగల గుణం ఉంటుంది. ఎండలో బాగా తిరిగినప్పుడు, ఎండ దెబ్బ తగలకుండా మిమ్మల్ని రక్షించే గుణం ఈ కీరదోసకి ఉందని నిపుణులు చెబుతున్నారు. కీరదోసల పొటాషియం అధికంగా ఉండుట చేత రక్తపోటును తగ్గించగలరని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా మన శరీరంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుటకు, కాకుండా గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీరదోసలో విటమిన్ కె,అధికంగా ఉంటుంది. ఇది గాయాల నుంచి రక్త శ్రావం కాకుండా వెంటనే రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఈ కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకానికి కూడా బాగా ఉపకరిస్తుంది.