అక్షరటుడే, వెబ్ డెస్క్ Summer : మార్చిలోనే (Summer) ఎండలు దంచికొడుతున్నాయి. పది తర్వాత బయటకి రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మార్చి 27 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 47 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 199 మండలాల్లో ఓ మోస్తారు వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలియజేశారు. దాంతో ప్రజలు భయపడిపోతున్నారు. బుధవారం ఏపీ Ap State రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 40.8°C, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.7°C, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
Summer : ఎండలు బాబోయ్ ఎండలు..
వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలియజేశారు. మరో వైపు తెలంగాణలో (Telangana) వాతావరణం (Heat Wave Alert) విషయానికి వస్తే దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులలో మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. (Telangana) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
ఈ రోజు గరిష్టంగా నిజామాబాద్ లో 40.1 కనిష్టంగా నల్లగొండ,హనుమకొండ లలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం రోజు ఆదిలాబాద్..39.3, నిజామాబాద్..39, భద్రాచలం..38.4, మెదక్..37.6, మహబూబ్ నగర్..37.5, ఖమ్మం..37, హనుమకొండ..36.5, రామగుండం..36, హైదరాబాద్..35.6, నల్లగొండ..35, డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు రాయలసీమ Rayalaseema నిప్పు కణంలా భగభగ మండిపోతూ ఉంటుంది. కోస్తాంధ్రలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఐతే, మేఘాలు వచ్చినప్పుడు, కొంత ఉపశమనంగా ఉంటుంది. అయితే ఈ ఎండల్లో చిన్న పిల్లలతో పాటు వృధ్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.