అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 20 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 90,470 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా వరద గేట్ల ద్వారా 62,480 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 6,800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కులు, వరద కాలువకు 19 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టo 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతే నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈఈ కొత్త రవి సూచించారు.