అక్షర టుడే, వెబ్ డెస్క్ Telangana : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. జనాలు బయటకి రావాలంటే భయపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ (Meteorological Department) శుభవార్త అందించింది. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. దక్షిణ భారతదేశంలో విస్తారమైన మేఘాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ మేఘాలు తూర్పు దిక్కుగా కదులుతూ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, Telangana, Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా వస్తున్నాయి. ఈ క్రమంలోని తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు శనివారం వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.
Telangana : చల్లని వార్త..
ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో వాతావరణం వేడిగా, పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. రాత్రి సమయానికి వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు (Rains) కురుస్తూనే ఉంటాయని అధికారులు తెలిపారు.
రాజస్థాన్ నుంచి కోస్తాకు వెళ్తున్న ఉపరితల అవర్తనం కారణంగా తెలంగాణలో (Telangana) వానలు పడే అవకాశముందని, ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, జల్లులు పడతాయన్నారు. ద్రోణి, ఉపరితల అవర్తనం కారణంగా తేమ గాలులు ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయన్న ఆయన వాతావరణంలోని weather వేడిని తగ్గించే అంత తేమ గాలులు వీయడం లేదని వివరించారు. మేఘాల్లో అనిశ్చతి ఏర్పడడం, మరోవైపు తేమగాలులు నీటి బిందువులుగా ఏర్పడి, మంచుగా మారుతాయని, అప్పుడు వాటికి పాజిటివ్, నెగటివ్ ఛార్జీలు డెవలప్ అవుతాయని, దీని డిశ్చార్జీనే మెరుపు, పిడుగులు అంటారని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.