అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటల నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతోంది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే భారీ వర్షం కావడం గమనార్హం.