అక్షరటుడే, వెబ్ డెస్క్: భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి. తక్కువ దృశ్యమానత కారణంగా విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ ఆర్థిక రాజధానిలో ల్యాండ్ కావాల్సిన 50 విమానాలు రద్దు చేయబడ్డాయి. వీటిని అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్‌తో సహా ఇతర ప్రదేశాలకు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం కీలక సూచనలు చేసింది. వారి విమాన స్థితిని తనిఖీ చేయాలని సలహా ఇచ్చింది. ప్రతికూల వాతావరణం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనల దృష్ట్యా.. ప్రయాణికులు విమానయాన సంస్థలతో తమ విమాన స్థితిని తనిఖీ చేసి, బయలుదేరాలని కోరింది.