
అక్షరటుడే, వెబ్‌డెస్క్: చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) హిందువుల కల. జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లి రావాలని అనుకుంటారు. జ్యోతిర్లింగాల్లో Jyotirlingas ఒకటైన కేదార్నాథ్ మహాద్భాగ్యంగా భావిస్తారు. ఎంతో కష్టమైన ఈ యాత్రను ఇకపై హెలీకాప్టర్లో తేలికగా చుట్టేయొచ్చు.
చార్ధామ్ chardham yatra tour యాత్ర త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా, కేదార్నాథ్ Kedarnath వెళ్లాలంటే వాహనాలకు గౌరీ కుండ్ gowri kund వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా సాగించాలి. హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంటే అంత సులువు కాదు. కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారి కోసం 2023లో ఉత్తరాఖండ్ సర్కారు Uttarakhand government హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
అక్షయ తృతీయ Akshaya Tritiyaను పురస్కరించుకుని ఏప్రిల్ 30న మొదటగా గంగోత్రి Gangotri, యమునోత్రి Yamunotri ఆలయాలు తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ ఆలయాన్ని మే 2 ఉదయం 7 గంటలకు తెరవనున్నారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తపిల్యాల్ ప్రకటించారు.
కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకుంటే.. భారతీయ రైల్వేకు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ (IRCTC) (https://heliyatra.irctc.co.in/) ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 నుంచి బుకింగ్లు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. మే 2 నుంచి 31వ తేదీ వరకు యాత్ర ఉంటుంది.