Helicopter crash | నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి దుర్మరణం

Helicopter crash | నదిలో కుప్పకూలిన హెలికాప్టర్..ఆరుగురి దుర్మరణం
Helicopter crash | నదిలో కుప్పకూలిన హెలికాప్టర్..ఆరుగురి దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helicopter crash : న్యూయార్క్(New York)లో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని హడ్సన్ నది(Hudson River)లో హెలికాప్టర్ పడిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఆరుగురు ఉండగా, వారందరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో(social media) వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement

న్యూయార్క్ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:17 నగరంలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలింది. బెల్-206 హెలికాప్టర్ నీటిలో పడిపోవడంతో, పైలట్, ఓ కుటుంబం చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిసింది.

మృతి చెందిన వారిని స్పెయిన్​(Spain)లోని సిమెన్స్ Siemens sprains ceo సీఈవో అగస్టిన్ ఎస్కోబార్(Agustin Escobar death), అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. న్యూయార్క్ డౌన్లెన్ మాన్హాట్టన్ హెలిపోర్ట్ నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్టు పేర్కొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nagarkurnool District | పోలీస్​ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్​.. ఫిర్యాదు చేసిన సీఐ