అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హీరో రజినీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. కాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందిస్తూ రజినీకాంత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.