అక్షరటుడే, వెబ్డెస్క్: Heroine Arrest : ఎయిర్పోర్టులో కన్నడ నటిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కన్నడ హీరోయిన్ రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దుబాయి నుంచి ఆమె 14.8 కేజీల బంగారాన్ని తీసుకొని విమానంలో బెంగళూర్ వచ్చారు. ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.
Heroine Arrest : గతంలోనూ..
రన్యారావు తరుచూ దుబాయి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు గుర్తించిన అధికారులు ఆమెను విచారిస్తున్నారు. కాగా అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుంది. రన్యా సుదీప్తో ఓ సినిమాలో నటించింది. ఆమె అరెస్టు సినీ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.