అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. గురువారం(21వ తేదీన) అవిశ్వాస ప్రక్రియ జరగాల్సి ఉంది. కాగా.. భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ను బుధవారం డిస్మిస్ చేసింది. దీంతో అవిశ్వాస పరీక్షకు ముందే భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. మరోవైపు వైస్ ఛైర్మన్ రమేశ్ రెడ్డి డీసీసీబీ డైరెక్టర్లతో క్యాంపులో ఉన్నారు. ఆయనే కాబోయే ఛైర్మన్ అని ప్రచారం జరుగుతోంది.