అక్షరటుడే, జుక్కల్: జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పై హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొంతకాలంగా ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది. వాదోపవాదాలు విన్న కోర్టు మదన్ మోహన్ వేసిన ఈ ఎలక్షన్ పిటిషన్ చెల్లదంటూ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.