అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group -1 Exams | గ్రూప్–1 నియామకాలపై హైకోర్టు High Court గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పలువురు, అభ్యర్థులు బీఆర్ఎస్ BRS నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒకే సెంటర్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని.. పరీక్ష రాసిన వారికంటే ఎక్కువ మంది ఫలితాలు ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి Padi Koushik Reddy గతంలో ఆరోపించారు.
అయితే ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని TGSPSC ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ Certification మాత్రం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.