అక్షరటుడే, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు. పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. మృతులను వెంకటేశ్, పరందాములుగా గుర్తించారు. ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనడానికి వీరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్, పరందాములు రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.