అక్షరటుడే, జుక్కల్‌ : పిట్లం మండలం అల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం విఠల్, ఉపాధ్యాయుడు ప్రశాంత్‌ బదిలీ కాగా, హెచ్‌ఎంగా రాము బదిలీపై వచ్చారు. దీంతో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నారాయణ రెడ్డి, వెంకట్‌కుమార్, నాయకులు పాపిరెడ్డి, అంబారెడ్డి, బాబు రావు, విఠల్‌ రావు, మల్లేశం, పోచయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు మారుతీ రావు, గోవింద్‌ రావు, మల్లయ్య, సాయిరాం, రాజు, తదితరులు ఉన్నారు.