అక్షరటుడే, కామారెడ్డి: Holi | హోలీ పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర(Kamareddy Sp Rajesh Chandra) పేర్కొన్నారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం(Drunken driving) మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు. ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోలీ జరుపుకోవాలన్నారు.
Holi | హానికరమైన రంగులు వాడొద్దు..
హానికరమైన రసాయనాలున్న రంగులను వాడవద్దని, బలవంతంగా రంగులు విసరడం నిషేధమని స్పష్టం చేశారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా రంగులు పూయడం, శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం నేరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబరుకు కాల్ చేయాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఎస్పీ సూచించారు.