అక్షరటుడే, ఇందూరు : Homeopathy nizamabad | అన్నిరకాల రుగ్మతలకు హోమియోపతిలో మందులుంటాయని ఆయూష్ జిల్లా ఇన్ఛార్జి జె.గంగదాస్(Ayush District In-charge) పేర్కొన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స హోమియోపతిలోనే సాధ్యమని తెలిపారు. ప్రపంచ హోమియో దినోత్సవం(Homeopathy Day) సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రి(District General Hospital)లోని 4వ అంతస్థులో హోమియో పితామహుడు(father of homeopathy) శామ్యూల్(Samuel) చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం గంగాదాస్(Gangadas) మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు సైతం సులభమైన చికిత్స విధానాలు హోమియోపతి(Homeopathy)లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీపీఎం వందన, వైద్యులు తిరుపతి, ఫార్మసిస్ట్లు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, భిక్షపతి, రమేశ్, జిల్లా ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.