Honey Trap | హనీట్రాప్​లో పడి దేశానికి ద్రోహం.. చివరికి జైలుకు..

Honey Trap | హనీట్రాప్​లో పడి..దేశానికి ద్రోహం..చివరికి జైలుకు
Honey Trap | హనీట్రాప్​లో పడి..దేశానికి ద్రోహం..చివరికి జైలుకు
Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: Honey Trap : దేశ భద్రత(national security)కు సంబంధించి రహస్యం(secretly)గా డీల్ చేసే డిపార్ట్మెంట్ అది. అంతటి సెన్సిటివ్ శాఖలో పని చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. అవసరం అయితే దేశ భద్రత కోసం కుటుంబాన్ని పనంగా పెట్టేంతగా, నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుంది. కానీ, ఒక అమ్మాయి మోజులో పడి.. దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయం బయటపడటంతో ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు ఆ ఆర్డినెన్స్ పరిశ్రమ ఉద్యోగి.

హజరత్ పూర్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రవీంద్ర కుమార్ అనే వ్యక్తి ఛార్జ్ మెన్ గా పని చేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్(Facebook) లో నేహా శర్మ పేరిట ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్. ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్(Pakistani intelligence agent) అని తెలిసినా కూడా నేహా శర్మ మాయలో పడిపోయాడు రవీంద్ర కుమార్. ఇండియాకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఫేస్​బుక్​ ద్వారా నేహా శర్మకు పంపించాడు.

విషయం కాస్త యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(Anti-Terrorist Squad) కి తెలియడంతో ఈ నెల 12న రవీంద్ర కుమార్​ను అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి రూ. 6 వేలు నగదు, ఎస్బీఐ డెబిట్ కార్డు, రెండు పోస్టు ఆఫీసు డెబిట్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడీ స్వాధీనం చేసుకున్నారు. గగన్ యాన్, డ్రోన్స్ వంటి కీలక రహస్య సమాచారాన్ని నేహా శర్మకు రవీంద్ర కుమార్ పంపించినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement