Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సూర్యాపేటలో పరువు హత్య కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటలోని మామిళ్ల గడ్డలో నివాసముండే వడ్ల కొండ కృష్ణ అనే యువకుడిని జనగామ సమీపంలోని మూసీ నది కట్టపై హత్య చేశారు. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్టు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆరు నెలల క్రితమే కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే పాత కక్షలే కారణమా..? లేక ప్రేమ వివాహమే కారణమై ఉంటుందా..? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Advertisement