ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

అక్షరటుడే, బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, బాన్సువాడ రెవిన్యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంసిహెచ్, ఏరియా ఆసుపత్రి కార్మికులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిఏఓ సువర్ణకు అందజేశారు. రేణుక, ఖమరుద్దీన్, సంతోష్ గౌడ్, సాయిలు, భూమయ్య, చిలుక పీరయ్య, పండరి, కృష్ణ, సురేందర్ గౌడ్, సురేఖ, రాజేశ్వరి, సంగీత, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | కాంగ్రెస్ పార్టీలో​ కార్యకర్తలందరికీ సమప్రాధాన్యం : కాసుల బాలరాజ్​