Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Results | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 581 వార్డెన్ పోస్టుల భర్తీ కోసం గతంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారి తుది జాబితాను టీఎస్పీఎస్సీ(TSPSC) సోమవారం ప్రకటించింది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24 నుంచి 29 వరకు పరీక్షలు జరిగాయి. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఈ క్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను కమిషన్ ప్రకటించింది.
Advertisement