అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Special Court | నగరంలో అర్ధరాత్రి వరకు హోటళ్లు(Hotels) తెరిచి ఉంచిన ఇద్దరికి న్యాయస్థానం ఒకరోజు జైలుశిక్ష విధించింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి(1st Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో హోటళ్లను(Hotels) రాత్రి 10.30 తర్వాత కూడా తెరిచి ఉంచిన షాగౌస్ హోటల్(Shaghouse Hotel) యజమాని షేక్ గౌస్ పాషా(Sheikh Ghaus Pasha), ఖురేషి హోటల్(Qureshi Hotel) యజమాని అన్సార్ హుస్సేన్(Ansar Hussein)లపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పర్చారు.
విచారించిన సెకండ్‌క్లాస్ జడ్జి(Second Class Judge) నూర్జహాన్(Noor Jahan) ఇరువురికి ఒక్కొక్కరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌హెచ్‌వో(SHO) తెలిపారు.