అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad city | అర్ధరాత్రి వరకు హోటళ్లు(Hotels), దుకాణాలు(Shops) తెరిచి ఉంచిన పలువురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి(One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో అర్ధరాత్రి తర్వాత కూడా దుకాణాలు, హోటళ్లు తెరిచిన గుల్జార్ పాన్‌షాప్, ఓల్డ్ ప్యారడైజ్ హోటల్, రైల్వేస్టేషన్ పాన్‌షాప్, ఎక్స్లెంట్ హోటల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. వీరందరికి రెండురోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు.
Nizamabad city | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న హోటళ్లు.. పలువురికి జైలు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement