అక్షరటుడే, వెబ్‌డెస్క్ : farmers | ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్(bonus for farmers) ఇస్తున్నామన్నారు.
ప్రస్తుతం 40 లక్షల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగవుతున్నట్లు ఆయన తెలిపారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచామని వివరించారు. వానాకాలం సీజన్(Yasangi season) సన్నాలకు బోనస్ కింద రైతుల ఖాతాల్లో రూ.1,206 కోట్లు జమ చేశామని భట్టి వివరించారు.