
అక్షరటుడే, వెబ్ డెస్క్: Indiramma Indlu : తెలంగాణ ప్రభుత్వం ఇండ్లులేని నిరుపేదలకి సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పరిశీలనలో లబ్ధిదారుడు అనర్హుడని గుర్తిస్తే.. వెంటనే రద్దు చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అయితే ఈ స్కీమ్‌లో భాగంగా మీ పేరు జాబితాలో ఉండాలంటే మీరు పేద కుటుంబం, నిరుద్యోగి, అనాథ కుటుంబం వంటి ఆధారాలు ఉండాలి. అర్హత కలిగిన వారిగా స్థానిక గ్రామపంచాయతీ లేదా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
Indiramma Indlu : ఇలా చేయండి..
ఈ స్కీమ్‌లో భాగంగా ఇంటి నిర్మాణం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం. మీ పేరు జాబితాలో చేరడానికి, స్థానిక అధికారులు పరిగణనలో తీసుకునే అంశాలు ఉన్నాయి. మీరు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అర్హులై ఉంటే, మీరు ఈ స్కీమ్ ద్వారా ఇల్లు పొందగలుగుతారు.
ప్రభుత్వం ఇచ్చే సాయం ద్వారా మీరు ఇబ్బందులు లేకుండా గృహం పొందవచ్చు. అయితే, ఈ అవకాశం ఎంత త్వరగా రాబోతుందో తెలుసుకోకపోతే, మీరు ఈ గొప్ప అవకాశం మిస్ అవుతారు. మరోవారం రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ముమ్మరం చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అర్హులైన వారిని ఎంపిక చేసి, త్వరతిగతిన పనులు మొదలు పెడతామని అన్నారు. జాబితాలో పేర్లు రానివారికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పొంగులేటి.
జనవరి మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అఫ్లికేషన్లను పరిశీలించి వాటిల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 562 గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా.. వాటిలో ఎదురైన లోటుపాట్లను బేరీజు చేసుకొని అర్హులను మాత్రమే గుర్తించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో వీలైనంత వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు.