అక్షరటుడే, వెబ్‌డెస్క్ UPI PIN : ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంక్ కి వెళ్లి రోజంతా క్యూలో నిలబడి వాళ్ల అకౌంట్ కి డబ్బులు పంపించేవాళ్లం. ఆ రోజుల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ.. నేడు క్షణాల్లో ఎవరికైనా, ఎక్కడ ఉన్నా డబ్బులు పంపించేయొచ్చు. చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కానీ, అది ఎలా సాధ్యం అయింది అంటే యూపీఐ వల్ల. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) వల్ల ఇది సాధ్యమైంది. యూపీఐ ఐడీ ద్వారా మన బ్యాంక్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు చెందిన యూపీఐ ఐడీకి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్‌తో డబ్బులు పంపించుకునే అవకాశం ఉంది.
యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాలంటే యూపీఐ పిన్ అనేది చాలా ముఖ్యం. దాని ద్వారానే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా డబ్బులు పంపిస్తాం. మరి, ఈ యూపీఐ పిన్ను ఎలా సెట్ చేసుకోవాలి, దీన్ని ఎలా మార్చుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. డెబిట్ కార్డు లేని వాళ్లు అయితే యూపీఐ పిన్ మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం.
UPI PIN : ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసుకుంటే చాలు
డెబిట్ కార్డు లేకున్నా.. మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు. దాని వల్ల మీదగ్గర డెబిట్ కార్డు లేకున్నా, యూపీఐ పిన్ ను మార్చుకోవచ్చు. యూపీఐ పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ లోకి వెళ్లి యూపీఐ పిన్ చేంజ్ అనే ఆప్షన్లో డెబిట్ కార్డు లేదా ఆధార్ ఓటీపీ ద్వారా పిన్ మార్చుకోవడానికి రెండు ఆప్షన్లను ఇస్తారు. అందులో ఆధార్ ఓటీపీ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. మీ ఆధార్‌కు లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ యూపీఐ పిన్ ను మార్చుకోవచ్చు.