అక్షర టుడే, వెబ్ డెస్క్ Blood Sugar Levels : ఈరోజుల్లో షుగర్ (Blood Sugar) అనేది కామన్. దాన్నే వైద్య పరిభాషలో డయాబెటిస్ అంటాం. ప్రతి పది మందిలో ఐదు నుంచి ఆరుగురు షుగర్ తో బాధపడుతున్నారు. అయితే, కొందరికి షుగర్ వచ్చిందనే విషయం కూడా తెలియదు. తమకు షుగర్ ఉందనే విషయం కూడా తెలుసుకోలేకపోతారు. కానీ, ఉదయం లేవగానే మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే, మీకు ఉదయం లేవగానే ఇలా అనిపించింది అంటే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. మీ బాడీలో షుగర్ లేవల్స్ పెరిగినట్టే. మరి, బాడీలో షుగర్ లేవల్స్ పెరిగాయి అని ఎలా తెలుసుకోవాలి?
మీరు ఉదయం లేవగానే మీ నోరు పొడిగా ఉన్నా, ఉదయం లేవగానే బాగా దాహం వేసినా, మీ శరీరంలో బ్లడ్ షుగర్ లేవల్స్ (Blood Sugar Levels) పెరిగాయని అనుకోవాలి. షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే తమ గొంతు పొడి బారినట్టుగా ఫీల్ అవుతారు. అందుకే, మీకు అలా అయిందంటే మీ బాడీలో షుగర్ లేవల్స్ పెరిగాయని అనుకోండి. మీరు ఉదయం లేవగానే మీ కళ్లు బ్లర్ గా కనిపించినా, మీ బాడీలో షుగర్ లేవల్స్ (Blood Sugar Levels) పెరిగాయని అనుకోవాలి. మధుమేహం ఉన్న వాళ్లకు త్వరగా కంటి చూపు తగ్గుతుంది.
Blood Sugar Levels : ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుందా?
చాలామందికి ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. అటువంటి వాళ్లు వెంటనే షుగర్ టెస్ట్(Blood Sugar Levels) చేయించుకోవాలి. ఉదయం లేవగానే అలసట, నీరసంగా, బలహీనంగా అనిపిస్తే షుగర్ వచ్చినట్టే లెక్క. అప్పుడు వెంటనే షుగర్ లేవల్స్ చెక్ చేయించుకోవాలి. రాత్రంతా బాగా నిద్రపోయినా, ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తే షుగర్ వచ్చే అవకాశాలు పెరిగినట్టే. తరుచూ మూత్రానికి వెళ్లడం, ఆకలి పెరగడం, చేతులు వణకడం, చెమట రావడం ఇవన్నీ షుగర్ (Blood Sugar Levels) రావడానికి సంకేతాలు. అందుకే నిర్లక్ష్యం వహించకుండా అటువంటివి మీ బాడీలోనూ కలిగితే వెంటనే షుగర్ లేవల్స్ చెక్ చేయించుకొని డాక్టర్ ను సంప్రదించడం బెటర్.