అక్షర టుడే, వెబ్ డెస్క్ NTR : టాలీవుడ్ లో (Tollywood) వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ లో వార్ 2 సినిమా (War 2 Movie) చేస్తున్న విషయం తెలిసిందే. టీ సీరీస్ నిర్మిస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. సినిమాలో ఒక సాంగ్ మినహా అంతా పూర్తైందని అన్నాడు.
రీసెంట్ గా ఒక పబ్లిక్ మీట్ లో పాల్గిన్న హృతిక్ రోషన్ (Hrithik Roshan) వార్ 2 సినిమా (War 2 Movie) గురించి మాట్లాడారు. వార్ 1 కన్నా చాలా పెద్దగా ఈ సినిమా వస్తుందని అన్నారు హృతిక్ అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అతను ఒక అమేజింగ్ యాక్టర్ అని అన్నాడు హృతిక్ రోషన్. మన ఎన్టీఆర్ గురించి హృతిక్ మాట్లాడటం చూసి తెలుగు ఆడియన్స్ అంతా కూడా ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ కి కూడా ఎన్టీఆర్ రేంజ్ ఏంటన్నది తెలిసింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
NTR : వార్ 2 సినిమా ఆగష్టు 14న రిలీజ్..
హృతిక్ రోషన్, (Hrithik Roshan)ఎన్టీఆర్ (NTR) కలిసి చేస్తున్న వార్ 2 సినిమా ఆగష్టు 14న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను సౌత్ లో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సినిమాకు తెలుగులో భారీ బిజినెస్ జరగనుంది. ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో తన ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఐతే వార్ 2 లో ఎన్టీఆర్ చేసేది నెగిటివ్ రోల్ అనే టాక్ నడుస్తుంది.
అదే నిజమైనా కూడా ఎన్టీఆర్ రేంజ్ ఏంటన్నది తెలుసు కాబట్టి ఫ్యాన్స్ ని మెప్పించేలా ఆయన సీన్స్ ఉంటాయని చెప్పొచ్చు. హృతిక్ రోషన్ కూడా వార్ 2 సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఐతే ఈ సినిమాతో హృతిక్ సౌత్ మార్కెట్ మీద గురి పెట్టాడని తెలుస్తుంది. ఆగష్టు 14న వార్ 2 బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు వస్తుంది.
ఒక్క పాట మిగిలింది, షూటింగ్ పూర్తైంది. కొంచెం నర్వస్‌గా ఉన్నా, బాగా చేస్తానని ఆశిస్తున్నాను. #NTR గారు అద్భుతం!#War2 Part 1 కంటే భారీగా ఉండబోతోంది.
:- @iHrithik
#JrNTR #HrithikRoshan @tarak9999pic.twitter.com/HPckA716Fb
— Milagro Movies (@MilagroMovies) April 5, 2025