అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | నూతన ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రోజంతా తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని భారీ నష్టాలతో ముగిశాయి.
మంగళవారం ఉదయం 532 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన సెన్సెక్స్ వెంటనే కోలుకుని 605 పాయింట్లు పెరిగి లాభాలబాట పట్టింది. అయితే ఇన్వెస్టర్ల సంతోషాన్ని ఆవిరి చేస్తూ ట్రంప్ టారిఫ్ భయాలతో ఇండెక్స్(Index)లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్(Sensex) ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,463 పాయింట్లు పడిపోయింది. చివరికి 1,390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద నిలిచింది. 178 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty) సైతం వెంటనే ఇంట్రాడేలో 224 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 399 పాయింట్లు నష్టపోయింది. ట్రేడిరగ్ ముగిసే సమయానికి 353 పాయింట్ల నష్టంతో 23,165 పాయింట్ల వద్ద స్థిరపడిరది. లార్జ్ క్యాప్ స్టాక్స్ భారీగా పతనమవగా.. మిడ్ క్యాప్ స్టాక్స్ కాస్త నిలదొక్కుకున్నాయి. చిన్న షేర్లపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లో ప్రభుత్వ వాటా 49 శాతానికి పెరుగుతుందన్న వార్తలతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 19 శాతానికిపైగా పెరిగాయి.
Stock Market | నష్టాల్లోనే అన్ని సెక్టార్లు..
ఐటీ((IT) సెక్టార్ 905 పాయింట్లకుపైగా పడిపోయింది. ఐటీ ఇండెక్స్‌లో ఎల్‌టీటీఎస్, విప్రో మినహా మిగతా షేర్లన్నీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఫై˜ౖనాన్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ రంగాల షేర్లతో పతనం ఇండెక్స్‌లను కిందికి పడేశాయి. హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రా, మెటల్, ఆటో, రియాలిటీ షేర్లూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మాత్రమే స్వల్ప లాభాలతో ముగిసింది.
Stock Market | లాభాల్లో రెండే..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,709 స్టాక్స్ లాభాల్లో ఉండగా 1,342 కంపెనీలు నష్టపోయాయి. 144 కంపెనీల షేర్లు నిలకడగా ఉన్నాయి సెన్సెక్స్I30లో రెండు స్టాక్స్ మాత్రమే లాభపడగా 28 స్టాక్స్ నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు(IndusInd Bank) 5.11 శాతం పెరగ్గా జొమాటో 0.27 శాతం లాభపడిరది.
Stock Market | నష్టాల్లో షేర్లు..
హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడు శాతానికిపైగా పడిపోగా బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా రెండు శాతానికిపైగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఆసియన్ పెయింట్స్ ఒకశాతానికిపైగా నష్టాలను చవిచూశాయి.