అక్షరటుడే వెబ్డెస్క్: GST collections | దేశంలో జీఎస్టీ(GST) వసూళ్లు భారీగా పెరిగాయి. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ వసూళ్లలో Goods and Service Tax collections గతేడాదితో పోలిస్తే ఈ యేడు మార్చిలో 9.9 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. రూ.1.96 లక్షల కోట్లు వసూలైనట్లు పేర్కొంది. ఇందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.38,100 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ.49,900 కోట్లుగా ఉన్నాయి.
ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ Integrated GST రూ.95,900 కోట్లు, సెస్సుల రూపంలో రూ.12,300 కోట్లు వసూలయ్యాయి. దేశీయ లావాదేవీలకు సంబంధించి 8.8 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లు ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. ఇంపోర్ట్ చేసిన వస్తువులపై వచ్చే ఆదాయంలో 13.56 వృద్ధి నమోదైందని.. దీని ద్వారా రూ.46,919 కోట్లు వచ్చినట్లు తెలిపింది. రిఫండ్స్ రూపంలో రూ.19,615 కోట్లు చెల్లించగా.. రూ.1.76లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలయ్యాని కేంద్రం పేర్కొంది.