Stock market | స్టాక్‌ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్‌ 2 శాతం అప్‌

Stock market | స్టాక్‌ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్‌ 2 శాతం అప్‌
Stock market | స్టాక్‌ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్‌ 2 శాతం అప్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock market | రెసిప్రోకల్‌ టారిఫ్‌ (Reciprocal tariff)ల అమలు విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గడంతో అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market) సూచీలు భారీ లాభాలతో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 1695 పాయింట్ల గ్యాప్‌అప్‌(Gap up)లో ఓపెన్‌ అయిన సెన్సెక్స్‌.. మొదటి అరగంటలో అమ్మకాల ఒత్తిడికి గురై 400 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని స్థిరంగా సాగుతోంది. నిఫ్టీ(Nifty) 540 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 160 పాయింట్లు తగ్గినా.. తిరిగి పైకి ఎగబాకుతోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 1,586 పాయింట్ల లాభంతో 76,743 వద్ద, నిఫ్టీ 478 పాయింట్ల లాభంతో 23,307 వద్ద కొనసాగుతున్నాయి.

Advertisement

Stock market | ర్యాలీకి కారణం..

సోమ, మంగళవారాల్లో గ్లోబల్‌ మార్కెట్లు global markets ర్యాలీ తీయడం, మన మార్కెట్‌లో వొలటాలిటీ ఇండెక్స్‌(VIX) 16 శాతం తగ్గడం, డాలర్‌తో రూపాయి విలువ 39 పైసలు బలపడి 85.70 కు చేరడం వంటి కారణాలతో మన మార్కెట్లు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌(Indus Ind Bank) వంటి లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో large-cap stocks హెవీ బయ్యింగ్‌ కనిపిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లతోపాటు రిలయన్స్‌ మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఇంపోర్టెడ్‌ వెహికిల్స్‌, ఆటో పార్ట్స్‌పై రెసిప్రోకల్‌ టారిఫ్‌ల Reciprocal tariff అమలును వాయిదా వేసే అవకాశాలు ఉండడంతో ఆటో సెక్టార్‌ స్టాక్స్‌ దూసుకుపోతున్నాయి. టాటా మోటార్స్‌(Tata Motors), ఎంఅండ్‌ఎం, సోనా బీఎల్‌డబ్ల్యూ, సంవర్ధన మదర్‌సన్‌ షేర్లు ర్యాలీ తీస్తున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock Market | కొనసాగిన ర్యాలీ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock market | ఆటో, బ్యాంకింగ్‌ సెక్టార్లలో జోరు..

అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నా.. రియాలిటీ, ఆటో(Auto), బ్యాంకింగ్‌ సెక్టార్లలో జోరు కనిపిస్తోంది. నిఫ్టీ Nifty రియాలిటీ సూచీ 4.5 శాతం పెరగ్గా.. ఆటో ఇండెక్స్‌ 3.25 శాతం, ఫిన్‌ నిఫ్టీ 2.75 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ Private Bank index 2.62 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. మెటల్‌ ఇండెక్స్‌ 2.5 శాతం, ఇన్‌ఫ్రా 2.3 శాతం, ఎనర్జీ 2.2 శాతం లాభంతో కదలాడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ(FMCG) సెక్టార్‌ మాత్రమే కాస్త నెగెటివ్‌గా సాగుతోంది.

Stock market | Gainers

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ BSE Sensex 30 ఇండెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో ట్రేడ్‌ అవుతుండగా మూడు కంపెనీలు మాత్రమే నష్టాలతో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ IndusInd Bank 7.38 శాతం పెరగ్గా.. టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, అదాని పోర్ట్స్‌ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడు శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.

Stock market | Losers

హిందుస్థాన్‌ మూనీలివర్‌(HUL), నెస్లే, ఐటీసీ స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి.

Advertisement