అక్షరటుడే, బోధన్: హున్సాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించాలని డీఈవో దుర్గాప్రసాద్ కు గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చారు. ప్రాథమిక, జడ్పీ పాఠశాలను విభజించాలని విన్నవించారు. దీంతో స్పందించిన డీఈవో ముగ్గురు టీచర్లను డిప్యూటేషన్‌పై కేటాయిస్తామని, త్వరలోనే జడ్పీ, ప్రాథమిక పాఠశాలలు విభజించి, పర్మినెంట్ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఈరయప్ప మహారాజ్, శంకర్, నారాయణ, నాని, శివకుమార్ పాల్గొన్నారు.